ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులతో భేటీ అయిన మాజీ MP కొండా విశ్వేశ్వర్ రెడ్డి. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, భవిష్యత్ రాజకీయల పై విద్యార్థి నాయకులతో చర్చిస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా గత కొంత కాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలలో అంతగా పాల్గొనటం లేదు.
కాంగ్రెస్ తో కూడా టచ్ మీ నాట్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఈటెల రాజేందర్ తెరాస ను వీడినపుడు ఆయనతో భేటి అయ్యారు. కెసిఆర్ ను ఎదుర్కునేందుకు వేదిక ఏర్పాటుపై ఇద్దరు చర్చినా కార్యరూపం దాల్చలేదు. రాష్ట్ర కాంగ్రెస్ లో కొండ విశ్వేశ్వర్ రెడ్డికి ఎవరి తో విభేదాలు లేకపోయినా ప్రజా సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంలో పిసిసి విఫలమైందని అనుచరులతో వాపోయినట్టు సమాచారం.
మరోవైపు ఉస్మానియా విద్యార్థులను కాంగ్రెస్ వైపు మళ్ళించే పనిలో కొండ నిమగ్నమయ్యారని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. కెసిఆర్ విధానాలతో అసంతృప్తిగా ఉన్న విద్యార్థులను కూడగట్టి ప్రభుత్వం పై పోరుకు సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు.