Tuesday, April 16, 2024
HomeTrending Newsపివి శతజయంతి ముగింపు వేడుకలు

పివి శతజయంతి ముగింపు వేడుకలు

హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో ఈ నెల 28 వ తేదిన జరిగే మాజి ప్రధానమంత్రి  పి.వి నరసింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు  వేడుకలకు గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరవుతారని, శతజయంతి వేడుకల కమిటీ చైర్మన్, పార్లమెంట్ సభ్యులు కె. కేశవరావు తెలియజేశారు.

బిఆర్ కెఆర్ భవన్ లో ఈ రోజు నిర్వహించిన సమావేశంలో  కమిటీ చైర్మన్ కేశవరావు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శతజయంతి వేడుకల ఏర్పాట్ల పై సమీక్షించారు. శత జయంతి వేడుకలు విజయవంతంగా నిర్వహించడానికి తగు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, జిఏడి ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్,  హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీకుమార్, ప్రొటోకాల్ డైరెక్టర్  అర్విందర్ సింగ్ మరియు ఇతర అధికారులు  పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్