Sunday, January 19, 2025
Homeసినిమావివాహ బంధానికి ముగింపు పలికిన నిహారిక, చైతన్య

వివాహ బంధానికి ముగింపు పలికిన నిహారిక, చైతన్య

నాగబాబు కుమార్తె అయిన నటి నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ తమ వివాహ బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వారు కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించిన దరఖాస్తు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక నిహారిక, చైతన్య జొన్నలగడ్డ గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. కాగా 2020 డిసెంబర్‌లో నిహారిక వివాహం గుంటూరు ఐజి జె.ప్రభాకర్ కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఈ పెళ్లి జరిగింది. వివాహం అనంతరం సినిమాలకు కొంత కాలంగా దూరంగా ఉన్న నిహారిక.

పెళ్లికి ముందు నిహారిక వెబ్ సిరీస్, సినిమాలు చేశారు. చేసినవి తక్కువే అయినా గానీ నటిగా కెరీర్ కంటిన్యూ అవుతూ ఉండేది. అయితే… పెళ్లి తర్వాత నటనకు విరామం ఇచ్చారు. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ని ప్రొడ్యూస్ చేశారంతే! చైతన్య నుంచి వేరు పడటంతో ఇప్పుడు ఆమె మళ్ళీ నటన, నిర్మాణం మీద దృష్టి పెట్టారు. మే 19న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్ ‘డెడ్ పిక్సెల్స్’లో ప్రధాన పాత్ర పోషించారు. నిర్మాతగా రెండు మూడు ప్రాజెక్టులు చేస్తున్నారని తెలిసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్