Utmost Care: ‘మిర్చి’ తో దర్శకుడిగా పరిచయమై తొలి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ కొరటాల శివ. ఆ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ లాంటి వరుస హిట్లతో బ్లాక్ బస్టర్స్ డైరెక్టర్ అనిపించుకున్నారు. ఇటీవల కొరటాల తెరకెక్కించిన ఆచార్య చిత్రం బాక్సాఫీస్ దగ్గర డోల్తాపడింది. అయితే.. కొరటాల శివ తాను డైరెక్ట్ చేసే సినిమాల బిజినెస్ విషయంలోనూ జోక్యం చేసుకుంటారనే టాక్ ఉంది. దీని వల్ల అనవసరంగా ఇబ్బందుల్లో పడుతున్నారని అంటున్నారు సినీ జనాలు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ ఓ భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ సహకారంతో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ లో సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈయన కొరటాల స్నేహితుడు. దీంతో ఈసారి కూడా దర్శకుడు అదనపు బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని టాక్ వచ్చింది. అయితే.. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాకు సంబంధించిన ఫైనాన్షియల్ సేల్స్, మార్కెటింగ్ అంశాలలో కొరటాల శివ ఏమాత్రం కలుగజేసుకోవాలని అనుకోవడం లేదట.
ఆచార్య ఫలితం తర్వాత మిగతా వ్యవహారాల కారణంగా దర్శకుడి స్క్రిప్ట్ మీద ప్రభావం పడుతోందని విమర్శలు రావడంతో అలాంటి నిర్ణయం తీసుకున్నారట. ఇక ఈ భారీ చిత్రాన్ని సెప్టెంబర్ లో స్టార్ట్ చేసి వచ్చే సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి.. ఈ మూవీతో మళ్లీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.
Also Read : సోషల్ మీడియాకి ‘కొరటాల’ గుడ్ బై