Sunday, January 19, 2025
Homeసినిమాఆ.. ఇద్దరికీ ఆఫర్ ఇచ్చిన మెగాస్టార్.

ఆ.. ఇద్దరికీ ఆఫర్ ఇచ్చిన మెగాస్టార్.

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు. ఖైదీ నెంబర్ 150 తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమా చేశారు. ఆతర్వాత ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ ఇలా ఒకేసారి నాలుగు సినిమాలు సెట్స్ పై ఉండేలా సినిమాలు చేస్తుండడం విశేషం.  ముఖ్యంగా యంగ్ డైరెక్టర్స్ తో వర్క్ చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అలాగే యంగ్ డైరెక్టర్స్ చిరంజీవితో సినిమా చేయడం కోసం కథలు రెడీ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. చిరంజీవి ఇద్దరు దర్శకులకు తనతో సినిమా చేయమని ఆఫర్ ఇచ్చారు. ఆ ఇద్దరిలో ముందుగా చెప్పుకోవాల్సింది క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణవంశీ గురించి. రంగమార్తాండ ప్రమోషన్ లో భాగంగా మీలాంటి దర్శకులు మీకు సరైన కథ దొరికే వరకు నన్ను సంప్రదించరు కానీ మీరు ఒక అడుగు ముందుకు వేస్తే కథలు ఆటోమేటిక్ గా వస్తాయి. నేను మీ దర్శకత్వంలో పని చేయాలనుకుంటున్నాను అని చిరంజీవి కృష్ణవంశీతో తన ఇంటరాక్షన్ సందర్భంగా అన్నారు. కృష్ణవంశీ చిరంజీవితో వందేమాతరం అనే సినిమా ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటున్నారు కానీ.. ఇప్పటి వరకు కుదరలేదు.

ఇక చిరంజీవి ఆఫర్ ఇచ్చిన మరో డైరెక్టర్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. చిరు, పూరి కలిసి ఆటోజానీ అనే సినిమా చేయాలి అనుకున్నారు కానీ.. కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే.. ఇటీవలే గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవిని పూరి ఇంటర్ వ్యూ చేశారు.  ఈ ఇంటర్ వ్యూలో  ఆటోజానీ కథ అలాగే ఉంచారా..? అని అడిగితే.. ఆ కథను చించేశాను. మీ కోసం మరో కథను రెడీ చేస్తున్నాను అని చెప్పారు పూరి. దీనికి చిరంజీవి మీరు ఎప్పుడంటే అప్పుడు సినిమా చేయడానికి రెడీగా ఉన్నాను అంటూ ఆపర్ ఇచ్చారు. మరి.. చిరు ఆఫర్ ఇద్దరిలో మార్పు తీసుకువస్తుందా..? చిరు కోసం కథలు రెడీ చేస్తారా..? ఎప్పుడు ఈ ప్రాజెక్టులు ప్రకటిస్తారు.. క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్