Saturday, January 18, 2025
Homeసినిమానాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి' టీమ్ పాదయాత్ర

నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’ టీమ్ పాదయాత్ర

నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి‘. ఈ చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. శంకర్ ప్రసాద్ ముల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 23న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా పాటలు, టీజర్ కు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతుండగా తాజాగా చిత్ర యూనిట్ పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ 14 – తిరుపతి;  సెప్టెంబర్ 15 – నెల్లూరు, ఒంగోలు; సెప్టెంబర్ 16 – విజయవాడ, గుంటూరు, ఏలూరు; సెప్టెంబర్ 17 – భీమవరం, రాజమండ్రి; సెప్టెంబర్ 18 – కాకినాడ , వైజాగ్ లో హీరో నాగశౌర్యతో పాటు చిత్ర యూనిట్ పాదయాత్ర నిర్వహించి ప్రేక్షకులు, అభిమానులని కలసి సందడి చేయనుంది. అలనాటి నటి రాధిక శరత్‌కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు.

Also Read: ‘కృష్ణ వ్రింద విహారి; థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్