సుప్రీంకోర్టు మెజారిటీ తీర్పు EWS రిజర్వేషన్లు సమర్ధించడం విచారకరమని బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు, YSRCP ఎంపి ఆర్ కృష్ణయ్య అన్నారు. గతంలో 9 మంది జడ్జీల ధర్మాసనం 50 శాతం మించకుడదని తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. అలాంటప్పుడు 5 గురు సభ్యుల ధర్మాసనం దీని మీద ఎలా తీర్పు ఇస్తుందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు కల్పించడానికి 103వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటును సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమర్థించటంపై ఎంపి ఆర్ కృష్ణయ్య ఈ రోజు ఢిల్లీలో స్పందించారు.
11 మంది సభ్యుల ధర్మాసనం దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నామన్న ఎంపి ఆర్ కృష్ణయ్య…సుప్రీం కోర్టు ఈ రోజు తీర్పును సవాలు చేస్తామని స్పష్టం చేశారు. అగ్రవర్ణాలకు రిజర్వేషన్ల కల్పించడం అనేది కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ వైఖరికి నిదర్శనం అన్నారు. రాజకీయ లబ్దికోసమే ఈ ews రిజర్వేషన్ల తీసుకొచ్చారని, రిజర్వేషన్లు అంటే పేదరిక నిర్మూలన పథకం కాదన్నారు. వెనకబడిన వర్గాలకు అధికారం ఇవ్వడం గౌరవం దక్కేలా చేసేందుకే రిజర్వేషన్లని, బిసిలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటప్పుడు అగ్రవర్ణ కులాలకు రిజర్వేషన్ లు ఇస్తే బిసిలకు ఓపెన్ కేటగిరీలో ఛాన్స్ తగ్గుతుందన్నారు. బిసిలకు అన్యాయం జరుగుతోందని, కేంద్ర ప్రభుత్వం ews రిజర్వేషన్లు పై పునరాలోచించాలని ఎంపి ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
Also Read : ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్