Sunday, April 6, 2025
HomeTrending Newsముఖ్రా గ్రామం అందరికీ ఆదర్శం: మంత్రి కేటిఆర్

ముఖ్రా గ్రామం అందరికీ ఆదర్శం: మంత్రి కేటిఆర్

Inspiration: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండ‌లంలోని ముఖ్రా కె గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన గ్రామ సర్పంచ్‌ గాడ్గె మీనాక్షిని  రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు.  ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అద్భుతంగా అమలుచేస్తూ, రాష్ట్రంలోని మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. స్వయం సమృద్ధి సాధించే చర్యల్లో భాగంగా ముఖ్రా గ్రామంలొ తడి చెత్త సేకరించి దాని ద్వారా సేంద్రీయ ఎరువులు తయారు చేసి, వీటిని విక్రయించడం ద్వారా పంచాయతీకి ఆరు లక్షల రూపాయల ఆదాయాన్ని సంపాదించారు.

నేడు సర్పంచ్ మీనాక్షి, గ్రామ పంచాయతీ సభ్యులు, అధికారులు హైదరాబాద్ లో మంత్రి కేటిఆర్ ను కలుసుకొని తాము తయారు చేసిన సేంద్రీయ ఎరువుల బస్తాను ఆయనకు చూపించారు. పంచాయతీ అభివృద్ధికి, ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలను, లబ్ధిదారుల వివరాలను ఏ విధంగా తాము ఫ్లెక్సీ ద్వారా బహిరంగంగా పెట్టామో వివరించారు. వారి చర్యలను కేటియార్ ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ ముఖ్రా కె గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ పథకాలను విజయవంతం చేయాలని కేటిఆర్ సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్