Wednesday, March 26, 2025
HomeTrending Newsబండికి కేటీఆర్ సవాల్

బండికి కేటీఆర్ సవాల్

గద్వాల నుంచి బండి సంజయ్ కు సవాల్ విసురుతున్నాని…చేతనైతే సవాల్ ను స్వీకరించు అని మంత్రి కేటిఆర్ అన్నారు. నేను చెప్పేది తప్పైతే… రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తా… నీది తప్పైతే నీ ఎంపీ పదవికి రాజీనామా చేస్తవా అని ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి 2 లక్షల 72 వేల కోట్లు పన్నుల రూపంలో కడితే… రాష్ట్రానికి ఇచ్చింది లక్ష 42 వేల కోట్లు మాత్రమే అన్నారు.

మొత్తం మీ పైసలే ఐతే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవని మంత్రి కేటిఆర్ దుయ్యబట్టారు. పక్క రాష్ట్రాలు తెలంగాణలో కేసీఆర్ పాలనను చూసి అసూయపడుతున్నాయన్నారు. పైసలు కేంద్రానివి, రాష్ట్రానివి సోకులు అంటు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని, మోడీ ప్రభుత్వం ప్రజలను దగా చేస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం 7 ఏళ్లలో లక్ష 32వేల 899 ఉద్యోగ నియామకాలు చేపట్టిందని, బీజేపీ ఇస్తామన్న కోట్ల ఉద్యోగాలెక్కడపోయినయ్ అని కేటీఆర్ మండిపడ్డారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్