Sunday, January 19, 2025
Homeసినిమాసమ్మర్ లో అయినా 'ఖుషి' వస్తుందా..?

సమ్మర్ లో అయినా ‘ఖుషి’ వస్తుందా..?

విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యారు. మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. లైగర్ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో మరింత క్రేజ్ తెచ్చుకుంటారు అనుకుంటే.. బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడడంతో బాగా డల్ అయ్యాడు. లైగర్ మూవీతో పాటు ‘ఖుషి‘ సినిమాను కూడా గతంలోనే స్టార్ట్ చేశాడు. అయితే.. లైగర్ డిజాస్టర్ అవ్వడం.. సమంత అనారోగ్యంతో షూటింగ్ ఆగడంతో ఖుషి షూటింగ్ కి బ్రేక్ పడింది. క్రిస్మస్ కు రావాల్సిన ఖుషి పోస్ట్ పోన్ అయ్యింది.

ఆరు నెలలుగా షూటింగ్ లేకపోవడంతో ఖుషి బజ్ అంతా పోయింది. సమంత ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో.. షూటింగ్ ఎప్పుడు అవుతుందో.. తెలియక రిలీజ్‌ను నిరవధికంగా వాయిదా వేశారు. ఎట్టకేలకు అయోమయం తొలగినట్లు సమాచారం. సమంత ఈ నెల 8 నుంచే ఖుషి షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇంకే అవాంతరాలు లేనట్లయితే.. విరామం లేకుండా సినిమా చిత్రీకరణ సాగించాలని.. రెండు నెలల్లో షూట్ మొత్తం పూర్తి చేయాలని అనుకుంటున్నారు మేకర్స్. అన్నీ కుదిరితే సమ్మర్ ఎండింగ్ లో అయినా సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

మే అంటే కష్టం కానీ.. జూన్ నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి అవకాశముంది. ఈసారి షెడ్యూళ్లు అయితే పక్కా ప్లానింగ్‌తో నడవబోతున్నట్లు తెలుస్తోంది. లైగర్ డిజాస్టర్ అవ్వడంతో ఖుషి మూవీ పైనే విజయ్ ఆశలు పెట్టుకున్నాడు. మరి.. ఖుషి అయినా విజయ్ కి విజయాన్ని అందిస్తుందో లేదో..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్