Sunday, January 19, 2025
HomeసినిమాKushi: విజయ్ దేవరకొండ 'ఖుషి' కాన్సెప్ట్ ఇదే..?

Kushi: విజయ్ దేవరకొండ ‘ఖుషి’ కాన్సెప్ట్ ఇదే..?

విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్లో రూపొందుతోన్న విభిన్న ప్రేమకథా చిత్రం ‘ఖుషి’. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే.. ఈ సినిమాని ప్రకటించినప్పటి నుంచి అసలు కథ ఏంటి..? అనేది ఆసక్తిగా మారింది. అలాగే ఈ సినిమా పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి కారణం ఏంటంటే… పవర్ స్టార్ కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రాల్లో ఒకటైన ఖుషి మూవీ టైటిల్ నే ఈ చిత్రానికి పెట్టడం ఓ కారణమైతే.. ప్రేమకథా చిత్రాలను చక్కగా తెరకెక్కిస్తున్న శివ నిర్వాణ ఈ మూవీకి దర్శకుడు కావడం మరో కారణం.

ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లు మధ్య ప్రేమ ఉన్నప్పటికీ.. ఈగో కారణంగా ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోరట. అలాగే ఈగో కారణంగానే పెళ్లి పీటల వరకు వెళ్లిన పెళ్లి ఆగిపోతుందట. ఇలా ఈగోతో ఉండే ఈ ఇద్దరు చివరికి ఒక్కటయ్యారా..? లేదా..? అనేదే ఈ కథ అని తెలిసింది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఖుషి మూవీ పై మరింత క్యూరియాసిటి పెరిగింది. సమంత అనారోగ్యం కారణంగా ఆమధ్య షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇటీవల షూటింగ్ స్టార్ట్ అయ్యింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంది.

సెప్టెంబర్ 1న ఖుషి చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. ‘లైగర్’ సినిమా డిజాస్టర్ అవ్వడంతో బాగా డీలాపడిన విజయ్ దేవరకొండ ఈసారి విజయం సాధించాలని కసితో ఉన్నాడు. ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. అలాగే సమంత ‘యశోద’ సినిమాతో సక్సెస్ సాధించింది కానీ.. ‘శాకుంతలం’ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో డల్ అయ్యింది. ఈమె కూడా ఖుషి మూవీతో సక్సెస్ సాధించి మళ్లీ ఫామ్ లోకి రావాలి అనుకుంటుంది. అలాగే డైరెక్టర్ శివ నిర్వాణ కూడా టక్ జగదీష్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు ఈ ఫీల్ గుడ్ మూవీతో మళ్లీ ట్రాక్ లోకి రావాలి అనుకుంటున్నాడు. ఇలా విజయ్, సమంత, శివ నిర్వాణ.. ముగ్గురూ పట్టుదలతో ఈ సినిమా చేస్తున్నారు. మరి.. ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్