కామన్ వెల్త్ గేమ్స్ లో లక్ష్య సేన్ బంగారు పతకం సాధించాడు. నేడు జరిగిన పురుషుల ఫైనల్లో మలేషియా ఆటగాడు టెజ్ యంగ్ పై 19-21; 21-9; 21-16తో విజయం సాధించి తన కల నెరవేర్చుకున్నాడు.
హోరాహోరీగా తొలి సెట్ ను 19-21తో కోల్పోయిన సేన్ పుంజుకొని రెండో సెట్ ను 21-9తో గెల్చుకున్నాడు. నిర్ణాయక మూడో సెట్ కూడా ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. చివరకు సేన్ దే పై చేయి అయ్యింది. 21-16 తో సెట్ తో పాటు బంగారు పతకం కూడా గెల్చుకున్నాడు.
కామన్ వెల్త్ గేమ్స్ వ్యక్తిగత విభాగంలో లక్ష్య సేన్ కు ఇదే తొలి పతకం కావడం గమనార్హం. గతవారం మిక్స్డ్ టీం విభాగంలో రజతం సాధించాడు
2018 యూత్ సమ్మర్ ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించాడు.
2021 వరల్డ్ ఛాంపియన్ షిప్స్ లో కాంస్య పతకం సాధించిన సేన్, ఈ ఏడాది థామస్ కప్ లో గోల్డ్ మెడల్ గెల్చుకున్నాడు.
Also Read : Badminton : స్వర్ణ సింధూరం