Sunday, January 19, 2025
HomeTrending Newsవైసీపీలోకి పిఠాపురం జనసేన నేతలు

వైసీపీలోకి పిఠాపురం జనసేన నేతలు

పిఠాపురం జనసేన మాజీ ఇన్ ఛార్జ్ మాకినీడి శేషుకుమారి ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. తాడేపల్లిలోని  సీఎం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఆమె వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో  వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌రెడ్డి, పిఠాపురం వైఎస్‌ఆర్‌సీపీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త వంగా గీత తదితరులు పాల్గొన్నారు.

2019 ఎన్నికల్లో జనసేన తరుపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శేషుకుమారి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆమెకు 28,011 ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

మరోవైపు రాధా–రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర కూడా  జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మిత్రమండలి సభ్యులు షేక్‌ బాబు, ఇమ్రాన్‌ రజా, పి.నరేంద్ర, నాగశ్రీనివాస్‌ కూడా ఆయనతోపాటు వైసీపీలో చేరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్