Sunday, January 19, 2025
Homeసినిమా'ఇండియన్ 2'కి సీక్వెల్ కూడా ఉందా..?

‘ఇండియన్ 2’కి సీక్వెల్ కూడా ఉందా..?

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘ఇండియన్’. ఆ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ఈ సినిమా రిలీజ్ తర్వాత లంచం తీసుకోవాలంటే.. భయపడేవాళ్లు అంటే.. ఎంత ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. అప్పటి నుంచి ఆ సినిమాకి సీక్వెల్ తీయాలి అనుకున్నారు. అది ఇప్పటికి సెట్ అయ్యింది. ఇండియన్ మూవీ చిత్రానికి సీక్వెల్ ‘ఇండియన్ 2’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో కమల్ కు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. హీరో సిద్థార్థ్ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం.

ఈ మూవీ పై కమల్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే.. తాజాగా ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఏంటంటే.. ఇండియన్ 2 ఇప్పటి వరకు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు తీసిన ఫుటేజ్ 6 గంటలు వచ్చిందట. ఈ ఆరు గంటల ఫుటేజ్ ని ఎడిటింగ్ చేసి ఒక సినిమాగా రిలీజ్ చేయాలంటే చాలా కష్టం. అందుకనే ఇండియన్ 2 చిత్రానికి సీక్వెల్ గా ఇండియన్ 3 కూడా తీయాలి అనుకుంటున్నారట. మేకర్స్ ప్రకటించలేదు కానీ.. ప్రచారంలో ఉన్నది వాస్తవమే అని టాక్ బలంగా వినిపిస్తోంది.

లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఇండియన్ 2 మూవీలో సిద్ధార్థ్ తో పాటు రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, గుల్షన్ గ్రోవర్, బాబీ సింహా, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా దీనికి అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తున్నారు. అయితే.. శంకర్ ఇండియాన్ 2 సీక్వెల్ పై త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్