Lock Down Control The Corona :
ఆస్ట్రేలియా ప్రపంచంలో కెల్లా సుదీర్ఘమైన లాక్ డౌన్ విధించింది. మెల్బోర్న్ నగరంలో ఏకంగా 262 రోజుల లాక్ డౌన్ కొనసాగింది. కొన్ని నగరాల్లో దీని నిడివి కాస్త తక్కువ , కానీ ఈ ప్రపంచంలో కెల్లా ఎక్కువ కాలం, ఖచ్చితమైన లాక్ డౌన్ పాటించింది ఆస్ట్రేలియా. అయితే ఆస్ట్రేలియాలో మొన్న కేసుల సంఖ్య 4000. నిన్న 5000. ఈ రోజు 8000 నమోదయ్యాయి. పరిస్థితి సమీక్షించాక ఇక పై లాక్ డౌన్ విధించబోమని ఆసిస్ ప్రభుత్వం ప్రకటించింది.
మరి ఇండియాలో ప్రజలు స్వచ్చందంగా లాక్ డౌన్ కోరుకుంటున్నారా?
లాక్ డౌన్ ఒకటే ప్రాణాలు కాపాడుతుందని అదేపనిగా హోరెత్తిస్తే అమాయక ప్రజలు నిజం అనుకొంటారు. అదే జరిగింది. మళ్ళీ జరిగినా ఆశ్చర్యం అక్కర లేదు. ఇంకోసారి లాక్ డౌన్ పెడితే సామాన్య ప్రజలు సర్వ నాశనం అయిపోతారు. చిన్నా చితకా వ్యాపారాలు ఎత్తి పోతాయి. ధరలు చుక్కల్ని అంటుతాయి. బతకడం దుర్భరం అయిపోతుంది. పెద్ద వ్యాపారస్తుల, ఆన్లైన్ కంపెనీలు. బహుళ జాతి కంపెనీల పట్టు మరింత బిగుస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే కరోనాతో చచ్చిపోయినా బాగుడేంది, ఎందుకు బతికామురా దేవుడా అని జన సామాన్యం బాధ పడే రోజులు వస్తాయి.
నిజం నిష్టురంగా ఉంటుంది.
ఇంగ్లాండ్ లో ఈ రోజు వరకు లక్ష ఇరవై వేల కేసులు వెలుగు చూశాయి. అయినా అక్కడ ఇంకా లాక్ డౌన్ లేదు.
మరి ఇండియా లో?
సమంతకు జలుబు పట్టిందా? హాస్య కార్యక్రమ యాంకర్ పొట్టి డ్రెస్ లు వేసుకొందా ? మా ఎన్నికల్లో లేటెస్ట్ ఏంటి ? .. ఇలాంటి అతిముఖ్యమైన విషయాలపై మన వారి దృష్టి నిమగ్నం అయివుంది. కరోనా సోకినా తిరిగి వాక్సిన్ వేసుకోవాలా? పూణే వాక్సిన్ కంపెనీ తన వెబ్ సైట్ లోనే వాక్సిన్ వేసుకొన్న కొంతమందికి గుండెపోటు రావొచ్చు అని ఎందుకు పెట్టింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వినియోగించాలి అని మాత్రమె అనుమతి పొందిన వాక్సిన్ ను రేపు పిలల్లకు వేయించడం అవసరమా? విమానాల్లో రోజుకు వేల మంది ఓమిక్రాన్ సోకిన వారిని దించుతూ, ఇక్కడ కట్టడి పేరుతొ దేశాన్ని నెమ్మదిగా లాక్ డౌన్ వైపు నడిపించడం ఏమి న్యాయం. ఇలాంటి ప్రశ్నలు అడిగే సమయం, అవసరం మనవారికి లేదు. అంతర్జాతీయ స్థాయిలో ఫార్మ కంపనీలు మాఫియాగా తయారై ఆడుతున్న క్రీడలో రాజకీయ నాయకులు కూడా భాగస్వాములు అవుతున్నారు. వీరికి వంతపాడుతున్న ఓ వర్గం మీడియా వరుస కథనాలతో సామాన్యులను బెంబేలేత్తిస్తున్నాయి.
Also Read : ఓమిక్రాన్ నియంత్రణకు కేంద్రం సూచనలు