Sunday, January 19, 2025
HomeTrending Newsమార్చి 3న బండ్లగూడ పోచారం ఫ్లాట్ల లాటరీ

మార్చి 3న బండ్లగూడ పోచారం ఫ్లాట్ల లాటరీ

హైదరాబాద్ లోని రాజీవ్ స్వగృహ కార్పోరేషన్ కు సంబంధించి బండ్లగూడ(నాగోలు), పోచారం ప్రాంతాల్లో మిగిలిపోయిన త్రిబుల్ బెడ్ రూమ్ (3BHK), డబుల్ బెడ్ రూమ్(2BHK), సింగిల్ బెడ్ రూమ్(1BHK), సింగిల్ బెడ్ రూమ్ సీనియర్ సిటిజన్(1BHK- Sr Citizen) ఫ్లాట్ల కేటాయింపుల కోసం మార్చి 3వ తేదీ(శుక్రవారం) న లాటరీ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) తెలిపింది.

ఫిబ్రవరి 15వ తేదీ వరకు టోకెన్ అడ్వాన్స్ గా 3BHK కోసం రూ.3 లక్షలు, 2BHK కోసం రూ.2 లక్షలు, 1BHK కోసం రూ.1 లక్ష చొప్పున డిమాండ్ డ్రాఫ్టులు కట్టిన వారు లాటరీకి అర్హులు.

మార్చి మూడవ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి జరిగే లాటరీని పారదర్శకంగా దరఖాస్తుదారులు ఆన్ లైన్ లో ప్రత్యక్షంగా యూట్యూబ్, ఫేస్ బుక్ ల ద్వారా తిలకించవచ్చు.
https://www.youtube.com/@ACEMedialive
https://www.facebook.com/AceMediaLive
https://youtube.com/@IPRTelanganaGovt

RELATED ARTICLES

Most Popular

న్యూస్