యువ సమ్రాట్ నాగచైతన్య – ఫిదా బ్యూటీ సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన చిత్రం ‘లవ్ స్టోరి’. అన్ని అడ్డంకులను దాటుకుని సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ‘లవ్ స్టోరి’ ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకెళుతుంది.
నాగ చైతన్య తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు రేవంత్ గా కనిపించాడు. లోన్ తీసుకొని బిజినెస్ చేయడం ద్వారా లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకునే డ్యాన్సర్ రేవంత్ గా నాగచైతన్యను చూపించడంతో ఈ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. మరో వైపు బీటెక్ పూర్తి చేసి ఎలాగైనా సాఫ్ట్ వేర్ జాబ్ సాధించాలనే యువతి మౌనికగా సాయి పల్లవిని చూపించారు. అయితే.. మౌనికలో దాగి ఉన్న డ్యాన్సింగ్ టాలెంట్ ని గుర్తిస్తాడు రేవంత్. ఆమెను మంచి డ్యాన్సర్ గా తీర్చిదిద్దేలా ప్రోత్సహిస్తాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడడం.. ఆ స్నేహం ప్రేమగా మారడం.. ఇక ప్రేమ అంటే అడ్డంకులు మామూలే కదా… వీరి ప్రేమకు కూడా అడ్డంకులు ఏర్పడడం.. ఆ అడ్డంకులను దాటుకుని వీళ్లు ఎలా ఒకటయ్యారు అనేదే ఈ ‘లవ్ స్టోరీ’ అనిపిస్తుంది.
చైతన్య తెలంగాణ యాసలో మాట్లాడడం బాగుంది. అలాగే నేచురల్ బ్యూటీ సాయిపల్లవి కూడా పాత్రకు తగ్గట్టుగా అదరగొట్టేసింది అనిపిస్తుంది. “మనకు లోన్లు ఇవ్వరు.. రెంటుకు రూములు ఇవ్వరు.. పిల్లనిస్తార్రా.. బతుక్కోసం ఈ ఉరుకులాట నాతో కాదింక.. చస్తే చద్దాం.. కానీ తేల్చుకొని చద్దాం” వంటి డైలాగ్స్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. మిడిల్ క్లాస్ యువకుడిగా నాగ చైతన్య కెరీర్ లోనే బెస్ట్ పెరఫార్మన్స్ ఇచ్చాడని చెప్పచ్చు. టోటల్ గా ఒక్కమాటలో చెప్పాలంటే… లవ్ స్టోరీ ట్రైలర్ అదిరింది. హిట్ పక్కా… అనేట్టు ఉంది.