Sunday, September 8, 2024
Homeస్పోర్ట్స్పంజాబ్ పై లక్నో విజయం

పంజాబ్ పై లక్నో విజయం

Lucknow won: ఐపీఎల్ లో నేడు జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ 20 పరుగులతో విజయం సాధించింది. లక్నో విసిరిన 154 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడంలో పంజాబ్ విఫలమైంది. లక్నో బౌలర్లు సమిష్టిగా రాణించి విజయం అందించారు.

పూణే లోని ఎంసిఏ స్టేడియంలో జరిగిన నేటి మ్యాచ్ లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. లక్నో లో ఓపెనర్ డికాక్-46 (37బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు); దీపక్ హుడా-34 మినహా మిగిలినవారు పెద్దగా రాణించలేదు. ఓపెనర్ గా దిగిన కెప్టెన్ కెఎల్ రాహుల్(6) ; కృనాల్ పాండ్యా (7); మార్కస్ స్టోనిస్ (1); ఆయుష్ బదోని-(4) తక్కువ స్కోరుకే ఔటయ్యారు. చివర్లో దుష్మంత చమీర-17; మోసిన్ ఖాన్-13 వేగంగా పరుగులు రాబట్టడంతో లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.  పంజాబ్ బౌలర్లలో రబడ నాలుగు; రాహుల్ చాహర్ రెండు; సందీప్ శర్మ ఒక వికెట్ పడగొట్టారు.

పంజాబ్ 38 పరుగులకు తొలి వికెట్ (మయాంక్ అగర్వాల్ -25) కోల్పోయింది, 46 వద్ద శిఖర్ ధావన్(5); 58 వద్ద భానుక రాజపక్ష (9) ఔటయ్యారు. లివింగ్ స్టోన్ 18 పరుగులు చేయగా, జితేష్ శర్మ కేవలం రెండు పరుగులకే వెనుదిరిగాడు. బెయిర్ స్టో 38 పరుగులతో జట్టును ఆదుకున్నాడు, అయితే 16 వ ఓవర్లో దుష్మంత చమీర బౌలింగ్ లో కృనాల్ పట్టిన క్యాచ్ కు వెనుదిరగడంతో పంజాబ్ ఆశలు గల్లంతయ్యాయి. రిషి ధావన్ 21 పరుగులతో ఆకట్టుకున్నా విజయం అందించలేకపోయాడు.  లక్నో బౌలర్లలో మోసిన్ ఖాన్ మూడు; కృనాల్ పాండ్యా, దుష్మంత చమీర చెరో రెండు; రవి బిష్ణోయ్ ఒక వికెట్ పడగొట్టారు.

కృనాల్ పాండ్యా కు ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

Also Read : కోల్ కతాపై ఢిల్లీ విజయం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్