Saturday, January 18, 2025
Homeసినిమా'లక్కీ లక్ష్మణ్' ఫస్ట్ లుక్ ను విడుదల

‘లక్కీ లక్ష్మణ్’ ఫస్ట్ లుక్ ను విడుదల

Lucky: దత్తాత్రేయ మీడియా పతాకం పై బిగ్ బాస్ ఫెమ్ సోహైల్, మోక్ష జంటగా ఎ.ఆర్ అభి దర్శకత్వంలో హరిత గోగినేని నిర్మిస్తున్న ఔట్ & ఔట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “లక్కీ లక్ష్మణ్”. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావి పూడి విడుదల చేశారు.

ఈ సందర్బంగాఅనిల్ రావి పూడి మాట్లాడుతూ.. ఈ సినిమా ఫస్ట్ లుక్ చాలా బాగుంది. నటుడు సోహైల్ నాకు బిగ్ బాస్ నుండి తెలుసు. తను నటన బాగుంటుంది. ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

చిత్ర హీరో సొహైల్ మాట్లాడుతూ… మా అనిల్ రావిపూడి అన్న ఎంతో బిజీగా ఉన్నా మా ”లక్కీ లక్ష్మణ్”  ఫస్ట్ లుక్ ను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. తను లాంచ్ చేయడంతో మా సినిమా బిగ్ సక్సెస్ అవుతుందని భావిస్తున్నాము. మా దర్శక, నిర్మాతలకు సినిమా పై ఎంత ప్యాషన్ ఉందో సినిమా కథలను సెలెక్ట్  చేసుకోవడంలో కూడా అంతే అభిరుచి ఉంది’ అన్నారు.

చిత్ర దర్శకుడు అభి మాట్లాడుతూ… నటీ, నటులు టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడం జరిగింది. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ చేసుకునే వరకు రావడమే కాకుండా నా ఫెవరెట్ డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడి గారి చేతుల మీదుగా మా ”లక్కీ లక్ష్మణ్”  ఫస్ట్ లుక్  విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. మా జనరేషన్ దర్శకులకు ఆయనే ఇన్స్పిరేషన్. అవుట్‌ అండ్‌ అవుట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్