‘Ori Devudaa‘: వైవిధ్యమైన పాత్రలు, చిత్రాలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్స్‌గా నటిస్తోన్న న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ఓరి దేవుడా’. ఒక వైపు కంటెంట్ బావుంటే మినిమం బడ్జెట్ చిత్రాలనైనా, ‘బలుపు’ వంటి భారీ కమర్షియల్ చిత్రాలనైనా, ‘ఊపిరి’ వంటి ఎమోషనల్ ఎంటర్‌టైనర్స్ అయినా, ‘మహర్షి’ వంటి మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ చిత్రాలనైనా నిర్మిస్తూ టాలీవుడ్‌లో బడా నిర్మాణ సంస్థగా ఇమేజ్ సంపాదించుకున్న పి.వి.పి సినిమా బ్యానర్ నిర్మాణంలో అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ‘ఓరిదేవుడా’ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
‘ఓరి దేవుడా’ చిత్రం నుంచి ‘పాఠశాలలో పాత బడదురా…’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చిన్ననాటి నుంచి పెద్దయ్యే వరకు ఉండే స్నేహితుల మధ్య ఉండే స్నేహం గురించి తెలియజేసేలా ఈ సాంగ్ ఉంది. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ పాటను అనంత శ్రీరామ్ రాశారు. అర్మాన్ మాలిక్, సమీరా భరద్వాజ్ ఈ పాటను పాడారు. తమిళ చిత్రం ‘ఓ మై కడవులే’కి ఇది రీమేక్. డైరెక్టర్ అశ్వత్ మారి ముత్తు తెలుగు నేటివిటీకి తగ్గట్లు కథలో మార్పులు చేర్పులు చేశారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ మాటలను అందిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీత సారథ్యం వహించారు. విదు అయ్యన్న సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్న ఈ చిత్రానికి వంశీ కాకా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయ్యింది. మరో వైపు ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరగుతున్నాయి.