మాచర్లలో జరిగిన సంఘటన ఫ్యాక్షన్ గొడవల్లో భాగంగా జరిగిందని, దీనికి రాజకీయ రంగు పులమడం సరికాదని పల్నాడు జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మాచర్లలో సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా అయన ఆయన మీడియాతో మాట్లాడుతూ… వెల్దుర్తికి సంబంధించిన ఫ్యాక్షన్ నేరచరిత్ర కలిగిన వ్యక్తులు మాచర్ల పట్టణంలో నివసిస్తున్నారన్న సమాచారంతో ముందస్తు చర్యలల్లో భాగంగా ఈరోజు ఉదయం నుండే అక్కడ కార్డెన్ & సర్చ్ నిర్వహించామని తెలిపారు. సాయంత్రం జరిగిన ‘ఇదేమి కర్మ మనరాష్ట్రానికి’ ఈ ఫ్యాక్షన్ నేరచరిత్ర కలిగిన వ్యక్తులు పాల్గొని ఉద్దేశపూర్వకంగా సమీప ప్రత్యర్థులపై రాళ్లతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారని ఎస్పీ వివరించారు. ఈ ప్రాంతంలో గత 20 నుండి 30 సంవత్సరాలుగా ఈ ఫ్యాక్షన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. పూర్తిగా ఫ్యాక్షన్ కు సంబంధించిన గొడవకు రాజకీయరంగు పులిమే ప్రయత్నం చేస్తూ ప్రత్యర్థులపై దాడులకు పాల్పడ్డారన్ని వెల్లడించాడు.
దాడుల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరినీ అదుపులోకి తీసుకుంటున్నామని, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉందని తెలియజేశారు.