యువ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి , అంజలి స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. సాంగ్, టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై పాజిటివ్ టాక్ ఉంది. ఆగష్టు 12న మాచర్ల నియోజకవర్గం చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
అయితే.. ఊహించని విధంగా సినిమా వివాదంలో చిక్కుకుంది. ఇంతకీ విషయం ఏంటంటే… డైరెక్టర్ ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో ఓ వ్యక్తి ఫేక్ ప్రొఫైల్ తయారు చేసి కొన్ని వర్గాలను కించపరిచేలా కామెంట్లు చేశాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ కాగా ఆ మాటలు అన్నది డైరెక్టరే అనుకుని మాచర్ల నియోజకర్గాన్ని బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది.
ఎవరో పనికట్టుకుని ఇదంతా చేస్తున్నారని ఆగ్రహించిన డైరెక్టర్ పోలీసులను ఆశ్రయించాడు. తన పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి తప్పుగా పోస్ట్ చేస్తున్నారని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ అకౌంట్ తనది కాదని స్పష్టం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫేక్ ట్వీట్ల స్క్రీన్ షాట్లను పోలీసులకు అందించాడు. మరి.. ఆగష్టు 12న వస్తున్న మాచర్ల నియోజకవర్గం ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.
Also Read : నితిన్ వర్సెస్ నిఖిల్ గెలిచేది ఎవరు?