Friday, September 20, 2024
HomeసినిమాMAD: సెప్టెంబర్ 28న ‘మ్యాడ్’ విడుదల

MAD: సెప్టెంబర్ 28న ‘మ్యాడ్’ విడుదల

ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమవుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’ను రక్షా బంధన్ రోజున సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ లో ఉంది.
వినోదభరితంగా సాగిన టీజర్ కి వస్తున్న అద్భుతమైన స్పందనతో మ్యాడ్ సినిమా విడుదల తేదీని ప్రకటించాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది.
మ్యాడ్ చిత్రం సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదల కానుంది. సూర్యదేవర నాగ వంశీ సమర్పిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ వినోదాత్మక చిత్రంలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఒక్క టీజర్ తోనే యువత దృష్టిని ఆకర్షించి, థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలనే ఆసక్తి కలిగేలా చేసిన మ్యాడ్ చిత్రం పై నిర్మాతలు మరియు మొత్తం చిత్ర బృందం ఎంతో నమ్మకంగా ఉన్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా, షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్