Saturday, January 18, 2025
Homeసినిమావిజయ్ మూవీలో మాధవన్..?

విజయ్ మూవీలో మాధవన్..?

విజయ్ దేవరకొండ ఇటీవల లైగర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘లైగర్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకుంటే.. ఇలా డిజాస్టర్ అవ్వడంతో విజయ్ షాక్ అయ్యాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఇండియా అంతా తిరిగి ప్రమోషన్ చేశాడు కానీ… ఆ కష్టం అంతా వృధా అయ్యింది. దీంతో ఆలోచనలో పడ్డ విజయ్.. నెక్ట్స్ మూవీస్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఎంత పెద్ద అవకాశం వచ్చినా కంగారు పడడం లేదు.

ప్రస్తుతం విజయ్ దృష్టి అంతా ‘ఖుషి‘ సినిమా పైనే ఉంది. దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమకథలను హృదయానికి హత్తుకునేలా తీస్తారు. ఇప్పుడు ఖుషి సినిమా ప్రేమకథా చిత్రం కావడంతో ఈసారి ఖచ్చితంగా సక్సెస్ సాధించడం ఖాయమని విజయ్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. సమంత అనారోగ్యం కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడడంతో ఖుషి మూవీ రిలీజ్ ఫిబ్రవరికి వెళ్లింది.

ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఈ చిత్రంలో మరో స్పెషల్ రోల్ ఉందట. సెకండాఫ్ లో వచ్చే ఈ కీలక పాత్రలో తమిళ నటుడు మాధవన్ నటిస్తాడట. అయితే.. ఈ వార్త పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఇది నిజం అయితే.. విజయ్ దేవరకొండ – సమంత మధ్యలో మాధవన్ పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ సినిమా కథ ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. విజయ్ ఖుషి మూవీతో సక్సెస్ సాధించి మళ్లీ ఫామ్ లోకి వస్తారని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Also Read :  విజ‌య్ దేవ‌ర‌కొండ ‘ఖుషి’లో రెండో హీరోయిన్! 

RELATED ARTICLES

Most Popular

న్యూస్