Wednesday, May 8, 2024
HomeTrending Newsగుజరాత్ ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధి

గుజరాత్ ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధి

భారత్ జోడో యాత్రకు రాహుల్ గాంధీ  రెండు రోజుల పాటు బ్రేక్ ఇచ్చారు. ఈ రోజు, రేపు గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. గుజరాత్లోని సూరత్, రాజ్ కోట్ లలో జరిగే ర్యాలీ, బహిరంగ సభల్లో రాహుల్ గాంధీ పాల్గొంటారు. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన తర్వాత రాహుల్ ఇప్పటి వరకూ అక్కడ పర్యటించలేదు. ఆయన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతుంది. గుజరాత్ కు వెళ్లకుండానే ఆయన యాత్ర కాశ్మీర్ కు చేరుకుంటుంది. బహిరంగ సభల్లో… ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు తన పాదయాత్రకు ఒకరోజు బ్రేక్ ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి కూడా రాహుల్ దూరంగా ఉన్నారు. కానీ గుజరాత్ లో మాత్రం తొలిసారి రెండు సభల్లో ఆయన పాల్గొంటుండటం విశేషం. రాజ్‌కోట్, సూరత్ లలో జరిగే బహిరంగసభల్లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా జలగావ్ జమోద్ సమీపంలోని భేంద్వాల్ నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభించారు. మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. భేంద్వాల్ నుంచి నిమఖేది వరకు కొనసాగింది. 15 రోజుల పాటు మహారాష్ట్రలో రాహుల్ గాంధి పాదయాత్ర కొనసాగగా…సుమారు 380 కిలోమీటర్లు నడిచి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ నెల ఏడో తేదిన తెలంగాణ నుంచి మహారాష్ట్ర నాందేడ్ జిల్లా డేగ్లూర్ లో ప్రవేశించిన రాహుల్ యాత్ర గురు నానక్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ నెల 23 న రాహుల్‌ గాంధీ పాదయాత్ర మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. అందుకు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేశారు. బుర్హాన్పూర్ జిల్లా నుంచి ప్రారంభం కానున్న పాదయాత్రలో రాహుల్ గాంధీ ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్