మధ్య ప్రదేశ్ క్రికెట్ జట్టు  చరిత్ర సృష్టించింది. 2021-22 రంజీ ట్రోఫీ ఫైనల్ లో ముంబై పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి తొలిసారి ఈ టైటిల్ విజేతగా నిలిచింది. ముంబై తన రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్ల నష్టానికి 113 పరుగులతో నేడు ఐదో రోజు ఆట మొదలు పెట్టింది. నిన్న 30 పరుగులతో క్రీజులో ఉన్న అర్మాన్ జాఫర్ మరో ఏడు పరుగులే చేసి 37 వద్ద ఔటయ్యాడు. సావేద్ పార్కర్ అర్ధ సెంచరీ (51) చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన సర్ఫరాజ్ ఖాన్ 45 పరుగులకు వెనుదిరిగాడు, దీనితో 269 పరుగులకు ముంబై ఆలౌట్ అయ్యింది.  మధ్య ప్రదేశ్ బౌలర్లలో కుమార్ కార్తికేయ నాలుగు;  పార్ధ్ సహానీ, గౌరవ్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

విజయానికి 108 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ రెండు పరుగుల వద్ద తొలి వికెట్ (యష్ దూబే-1) కోల్పోయింది. మరో ఓపెనర్ హిమాన్షు మంత్రి 37; శుభమ్ శర్మ 30 పరుగులు చేశారు.  పార్ధ్ సహానీ ఐదు పరుగులకే వెనుదిరిగాడు. రజత్ పటీదార్-30 పరుగులతో రాణించి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.

ముంబై బౌలర్లలో శామ్స్ ములానీ మూడు, దావల్ కుల్ కర్ణి ఒక వికెట్ పడగొట్టారు.

శుభమ్ ఎస్. శర్మకు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’…… సర్ఫరాజ్ ఖాన్ కు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ లభించింది.

చంద్రకాంత్ పండిట్ ప్రస్తుతం మధ్య ప్రదేశ్ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్నారు. 23 ఏళ్ళ క్రితం చంద్రకాంత్ కెప్టెన్ గా మధ్యప్రదేశ్ జట్టు కర్నాటక చేతిలో ఫైనల్లో ఓడిపోయింది, ఆ సమయంలో ఓటమి బాధతో కన్నీరు పెట్టుకున్న చంద్రకాంత్ నేటి విజయంతో ఆనంద భాష్పాలు రాల్చారు. మ్యాచ్ కు హాజరైన ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో ఆయన్ను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *