Sunday, January 19, 2025
HomeTrending Newsఢిల్లీ లిక్కర్ స్కాంలో మాగుంట రాఘవ అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాగుంట రాఘవ అరెస్ట్

దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో అరెస్ట్ జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో  వై ఎస్ ఆర్ సి పి నేత, ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు మాగుంట రాఘవ అరెస్ట్ అయ్యారు. మాగుంట రాఘవను అరెస్ట్ చేసిన ఈడి.. ఢిల్లీకి తీసుకుపోయినట్లు సమాచారం అందుతోంది. మాగుంట రాఘవను మధ్యాహ్నం కోర్టులో  ఈడీ అధికారులు హాజరుపర్చనున్నారు.

ఈ స్కామ్‌తో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న సౌత్ గ్రూప్.. మాగుంట రాఘవరెడ్డి పేరును ప్రస్తావించినట్లు తెలిసింది. సౌత్ గ్రూప్‌లో అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, రాఘవరెడ్డి ఇప్పటివరకూ అరెస్ట్ అయ్యారు. రెండ్రోజులుగా రాఘవరెడ్డిని ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు.. ఆయన సరిగా సహకరించట్లేదనే ఉద్దేశంతో.. అరెస్టు చేసినట్లు తెలిసింది.

Also Read : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాగుంట రాఘవ అరెస్ట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్