Sunday, November 24, 2024
HomeTrending Newsమహబూబ్ నగర్ లో మెడికల్ టూరిజం - మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ లో మెడికల్ టూరిజం – మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ జిల్లాలో ఇకపై సరైన వైద్యం అందక మరణించే ఘటనలు పునరావృతం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మహబూబ్ నగర్ జిల్లాలో ఆధునిక, మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రణాలికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. వివిధ దేశాల్లో స్థిరపడిన ప్రముఖ డాక్టర్లు …స్థానిక మహబూబ్ నగర్ జిల్లా లో సేవలు అందిస్తున్న డాక్టర్లు తో కలసి కన్సల్టింగ్ వైద్య సేవలు అందించేందుకు E – Seva Clinics ను జనవరి – 2023 లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

మహబూబ్ నగర్ ను మెడికల్ టూరిజంగా అభివృద్ధి చేసేందుకు అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి వివిధ దేశాల్లో స్థిరపడిన ఉమ్మడి జిల్లాకు చెందిన డాక్టర్లతో ఈ రోజు Zoom Mee నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో వారు పుట్టిన గడ్డకు వైద్య సేవలు అందించేందుకు డా. శ్రీని గంగాపాని ఆధ్వర్యంలో E-World Global Doctors Association సహకారంతో ఏర్పాటు చేసిన E – Global Doctors Zoom Meet లో మంత్రి  శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మహబూబ్ నగర్ ను మెడికల్ టూరిజంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో మెడికల్ టూరిజం అభివృద్ధి పై రాష్ట్ర IT శాఖ మంత్రి KTR, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు లతో కలసి చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.  Zoom meet లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వివిధ దేశాల్లో ని ప్రముఖ డాక్టర్లు, జిల్లా కు చెందిన డాక్టర్లు మహబూబ్ Dr రామ్మోహన్ IMA ప్రెసిడెంట్ , డా. మధుసూదన్ రెడ్డి, డా. శామ్యూల్, డా. శరత్ చంద్ర, డా. వంశీ కృష్ణ, రవి చందర్, CEO – softpath systams, డా. విజయ్ కాంత్, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. జీవన్, డా. మహేష్ బాబు, డా. నార్సింహులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్