మహబూబ్ నగర్ – గద్వాల రైల్వే స్టేషన్ల మధ్య నిన్న మొదటి సారి విద్యుత్ తో నడిచే ఇంజిన్ పరుగులు తీసింది. గత ఆరు నెలల క్రితం ప్రారంభించిన ఈ విద్యుత్ లైన్ పనులు శరవేగంగా పూర్తి కావడంతో ఇది సాధ్యం అయింది. ఇదివరకే హైదరాబాదు – మహబూబ్ నగర్ బెంగుళూరు – కర్నూలు మధ్య విద్యుత్ లైన్ పనులు పూర్తి అయ్యాయి. ఇక మిగిలిన మహబూబ్ నగర్ – కర్నూలు మధ్య పనులు పూర్తి కావాల్సి ఉండగా గద్వాల వరకు పనులు పూర్తి చేసారు. దీనితో గద్వాల స్టేషన్ లో పూజల నిర్వహించి మొదటి ఇంజన్ ను విజయవంతంగా మహబూబ్ నగర్ వరకు నడిపారు. వచ్చే మార్చి చివరి నాటికి గద్వాల-కర్నూలు మధ్య మిగిలిన పనులు పూర్తి చేయాలన్నా లక్ష్యంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు పనిచేస్తున్నారు. ఈ లక్ష్యం కార్యరూపంతో హైదరాబాదు – బెంగుళూరు, తిరుపతి, చెన్నైల మధ్య రైళ్ల వేగం పెరిగి ప్రయాణ సమయం తగ్గుతుంది.
Also Read : దక్షిణ మధ్య రైల్వే జీఎంగా అరుణ్ కుమార్ జైన్