Friday, September 27, 2024
Homeసినిమామహేష్‌, త్రివిక్రమ్ మూవీకి టైటిల్ ఫిక్స్ అయ్యిందా..?

మహేష్‌, త్రివిక్రమ్ మూవీకి టైటిల్ ఫిక్స్ అయ్యిందా..?

మహేష్‌ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. ఇందులో మహేష్‌ కు జంటగా పూజా హేగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత చేస్తున్న మూవీ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుచేత ఈ మూవీ అప్ డేట్స్ కోసం మహేష్‌ బాబు అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే.. ఈ చిత్రానికి టైటిల్ అంటూ ఆరంభం, అర్జునుడు, అతడే పార్థు అనే టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. త్రివిక్రమ్ కు తన సినిమాలకు టైటిల్ అ అనే అక్షరంతో పెడతారు కాబట్టి ప్రచారంలో ఉన్న టైటిల్స్ అ అనే అక్షరంతోనే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ టైటిల్స్ లో ఒక టైటిల్ కన్ ఫర్మ్ చేస్తారని టాక్ వినిపించింది. ఇప్పుడు కొత్తగా మరో టైటిల్ తెర పైకి వచ్చింది. అదే.. ‘అమ్మ కథ’. ఈ టైటిల్ నే పెట్టాలని చిత్రయూనిట్ ఫిక్స్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది.

నిజానికి గతంలో పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది వంటి సాఫ్ట్ టైటిల్ పెట్టి దానితో భారీ హిట్ సొంతం చేసుకున్నారు త్రివిక్రమ్. అయితే ఆ సినిమా మాదిరిగా ఇందులో కూడా మంచి ఎమోషన్స్ తో పాటు ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని అలరించే పక్కా కమర్షియల్ అంశాలు కూడా ఉండేలా జాగ్రత్తగా దీనిని తెరకెక్కిస్తున్నారట. అలానే టైటిల్ తో పాటు ఈ మూవీ ఫస్ట్ లుక్ ని ఉగాది సందర్భంగా యూనిట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి.. ప్రచారంలో ఉన్న ఈ టైటిల్స్ లో ఏ టైటిల్ ని ఫిక్స్ చేస్తారో చూడాలి.

Also Read : మహేష్‌ మూవీకి భారీ డీల్ కుదిరిందా…?

RELATED ARTICLES

Most Popular

న్యూస్