Sunday, January 19, 2025
Homeసినిమామహేష్ 'గుంటూరు కారం' అప్ డేట్ ఏంటి..?

మహేష్ ‘గుంటూరు కారం’ అప్ డేట్ ఏంటి..?

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ, క్రేజీ మూవీ ‘గుంటూరు కారం’. ఇటీవల ఈ మూవీ టీజర్ రిలీజ్ చేస్తే.. ట్రెమండ్ రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళ్లింది. దీంతో సినిమా పై మరింతగా అంచనాలు పెరిగాయి. అయితే.. ఈ సినిమాని ఏ మూహుర్తాన ప్రారంభించారో కానీ.. అడ్డంకులు ఏర్పడుతూనే ఉన్నాయి. ఇటీవల మహేష్‌ బాబు పుట్టినరోజు సందర్భంగా విదేశాలకు వెళ్లారు. అక్కడే బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చారు.

మరి.. గుంటూరు కారం షూటింగ్ లో మహేష్ పాల్గొనేది ఎప్పుడు అంటే.. మహేష్ రెడీగానే ఉన్నారట. ఇప్పటికే గుంటూరు కారం షూటింగ్ కి బ్రేకులు పడడంతో ఇక నుంచి ఎలాంటి గ్యాప్ లేకుండా చాలా ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారట. ఇదే విషయాన్ని గుంటూరు కారం మేకర్స్ మహేష్ చెప్పాడట. అయితే.. గుంటూరు కారం షూటింగ్ కు బ్రేకులు పడడం.. బర్త్ డేకు మరో టీజర్ కానీ.. ఫస్ట్ సింగిల్ కానీ రిలీజ్ అవుతుంది అనుకుంటే.. రిలీజ్ చేయకపోవడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారు.

ఇదంతా తెలుసుకున్నారు కాబట్టే ఇక నుంచి ఎలాంటి బ్రేక్స్ లేకుండా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట. త్రివిక్రమ్ కూడా ఇక నుంచి ఎలాంటి పనులు పెట్టుకోవడం లేదట. ఫోకస్ అంతా ఈ సినిమా పైనే పెట్టాలని డిసైడ్ అయ్యాడట. మరి.. ఎప్పుడు తాజా షెడ్యూల్ స్టార్ట్ అవుతుందంటే.. ఈ వారం నుంచి తాజా షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇందులో మహేష్‌ కు జంటగా శ్రీలీల నటిస్తుంటే.. మీనాక్షి చౌదరి హీరో మరదల పాత్ర చేస్తుందట. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్