Sunday, January 19, 2025
Homeసినిమామ‌హేష్ డ‌బుల్ రోల్?

మ‌హేష్ డ‌బుల్ రోల్?

Dual Role: సూప‌ర్ స్టార్ మహేష్‌ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను జులై రెండో వారం నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అత‌డు, ఖ‌లేజా చిత్రాల త‌ర్వాత మ‌హేష్‌, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న 3వ సినిమా ఇది. అందువలన అభిమానులంతా ఆసక్తితో ఉన్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. ఈ సినిమాలో మహేష్‌ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నాడనేది తాజా సమాచారం. ఇప్పుడు ఇది అభిమానుల్లో మరింతగా ఆతృత‌ను పెంచే అంశంగానే చెప్పాలి. మ‌రో విష‌యం ఏంటంటే.. గతాన్ని వర్తమానాన్ని కలిపి చూపిస్తూ ఈ కథ నడుస్తుందట‌.

రామ్- లక్ష్మణ్ ఈ సినిమాకి స్టంట్ కొరియోగ్రాఫర్స్ గా ఉన్నారు. వాళ్లు కంపోజ్ చేసిన ఒక భారీ యాక్షన్ సీన్ తోనే ఈ సినిమా షూటింగు మొదలవుతుందని అంటున్నారు. ఇందులో మ‌హేష్ స‌ర‌స‌న క్రేజీ హీరోయిన్ పూజ హెగ్డే కథానాయికగా అలరించనుంది. మ‌హేష్ డ‌బుల్ రోల్ చేయ‌నున్నార‌ని తెలిసిన‌ప్ప‌టి నుంచి ఈ సినిమా పై అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. అయితే.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త వాస్త‌వ‌మేనా..?  కాదా..? అనేది తెలియాల్సివుంది.

Also Read : మ‌హేష్ మూవీలో నంద‌మూరి హీరో? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్