Saturday, November 23, 2024
Homeసినిమాపోస్ట్ ప్రొడక్షన్ కే ఏడాది సమయం?

పోస్ట్ ప్రొడక్షన్ కే ఏడాది సమయం?

3 Years?: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిల క్రేజీ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రానుంద‌ని గ‌త కొంత‌కాలంగా వార్తా వ‌స్తూనే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత రాజ‌మౌళి చేసే సినిమా మ‌హేష్ బాబుతోనే అని తెలిసిన‌ప్ప‌టి నుంచి అభిమానులు మ‌రింత ఆతృత‌గా అప్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది వరకే ఆఫ్రికా అడవుల్లో నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందని రచయిత విజయేంద్రప్రసాద్ ఒక క్లారిటీ ఇచ్చారు.

అయితే… ఆ కథ విషయంలో రాజమౌళి ఒప్పుకున్నాడా? లేదా? అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. రీసెంట్ గా రాజమౌళి యూనిట్ ఇమేజ్ అనే ఒక ప్రముఖ 3డి యానిమేషన్ విఎఫ్ఎక్స్ స్టూడియో సంస్థను కలిశారు. ఫ్రాన్స్ కు చెందిన ఆ కంపెనీలో ఇది వరకు చాలా పెద్ద యానిమేటెడ్ సినిమాలు గ్రాఫిక్ సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు రాజమౌళి తన సినిమాలకు విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ గా పని చేసే కమల్ కన్నన్ తో వెళ్లి సంస్థ ప్రతినిధులను ప్రత్యేకంగా కలిశాడు.

వారితో నెక్స్ట్ వర్క్ చేయబోతున్నట్లు చెబుతూ ప్రత్యేకంగా ఫోటోను కూడా పోస్ట్ చేశారు. అయితే.. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులను పూర్తి చేసే పనిలో దర్శకుడు రాజమౌళి చాలా బిజీగా ఉన్నాడు. 2023 లో షూటింగ్ మొదలు పెట్టి ఏడాదిన్నర వరకు షూటింగ్ జ‌రిగే అవకాశం ఉంటుంది. ఇక ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు కోసం ఒక ఏడాది సమయం తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్ల సమయం తీసుకునే అవకాశం ఉంటుంది అని తెలుస్తోంది. అదీ..సంగ‌తి.

Also Read : రాజమౌళి చేతుల మీదుగా “హ్యాపీ బర్త్ డే” ట్రైలర్ విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్