Saturday, January 18, 2025
Homeసినిమామ‌హేష్‌, త్రివిక్ర‌మ్ మూవీ టైటిల్ ఇదేనా..?

మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ మూవీ టైటిల్ ఇదేనా..?

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్ లో రూపొందిన  ‘అతడు’, ‘ఖ‌లేజా ‘చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డం తెలిసిందే. ఇప్పుడు 11 సంవ‌త్స‌రాల త‌ర్వాత వీరిద్దరూ తమ హ్యాట్రిక్ మూవీ చేస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవ‌లే  రెగ్యుల‌ర్ షూటింగ్ మొదలయ్యింది.

‘#SSMB28ఆరంభం’ అనే హ్యాష్ టాగ్ ని యూనిట్ వాడింది. దీనితో  ‘ఆరంభం‘ అనే టైటిల్ దీనికి ఫిక్స్ చేశారా..? అనే అనుమానం మొద‌లైంది సినీ జ‌నాల్లో. ఎన్టీఆర్, రామ్ చరణ్ తో రాజమౌళి తన సినిమాని ప్రకటించినప్పుడు తమ ముగ్గురి పేర్లలోని ఆర్ అక్షరం తీసుకొని ఆర్ ఆర్ ఆర్ అనే హ్యాష్ టాగ్ వాడారు. ఆ తర్వాత అదే సినిమా టైటిల్ గా మారింది. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా అదే పద్దతిలో ఆరంభం అనే హ్యాష్ టాగ్ ని వాడుతున్నారా?  అనిపిస్తుంది.

అతడు, అ ఆ, అజ్ఞాతవాసి, అత్తారింటికి దారేది, అరవింద సమేత, అల వైకుంఠపురంలో… ఇలా త్రివిక్ర‌మ్.. త‌న‌ చిత్రాల టైటిల్స్ ఎక్కువగా అ అనే అక్ష‌రంతోనే మొదలయ్యాయి. ఆ లెక్కన ‘ఆరంభం’ కూడా సరిపోతుంది. సినిమా సగ భాగం పూర్తైన‌ తర్వాత టైటిల్ ప్రకటించడం త్రివిక్రమ్ కి అలవాటు. మరి ‘ఆరంభం’ అనే టైటిల్ ని కూడా అలాగే ప్ర‌క‌టిస్తారా..?  లేక మరో టైటిల్ ఫిక్స్ చేస్తారా..? అనేది ఆస‌క్తిగా మారింది.

Also Read: మ‌హేష్‌, త్రివిక్రమ్ మూవీలో మోహ‌న్ లాల్? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్