Sunday, January 19, 2025
Homeసినిమా'ఆచార్య' కు మ‌హేష్ 'మాట' సాయం

‘ఆచార్య’ కు మ‌హేష్ ‘మాట’ సాయం

Mega Mahesh: మెగాస్టార్ చిరంజీవి న‌టించిన తాజా చిత్రం ఆచార్య‌. ఈ భాఈ చిత్రానికి బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. ఇందులో కీల‌క పాత్ర పోషించ‌డం విశేషం. ఈ భారీ, క్రేజీ మూవీ కోసం మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 29న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 23న భారీగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేక‌ర్స్.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు వాయిస్ ఓవ‌ర్ అందించార‌ట‌. ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఆచార్య సినిమా పై ఆడియ‌న్స్ లో మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది. అస‌లు ఈ సినిమాలో సిద్ద పాత్ర‌ను మ‌హేష్ బాబుతో చేయించాలి అనుకున్నారు కొరటాల‌. మ‌హేష్ కూడా ఈ సినిమాలో న‌టించేందుకు ఓకే చెప్పారు. అయితే.. చిరంజీవి ఈ పాత్ర‌ను రామ్ చ‌ర‌ణ్ చేస్తేనే బాగుంటుంది. పైగా చ‌ర‌ణ్  వాళ్ళమ్మ మా ఇద్ద‌రినీ తెర పై చూడాల‌నుకుంటుంది అని చెప్పడంతో కొర‌టాల ఓకే అన్నారు.

అయితే.. ఈ సినిమాలో న‌టించ‌డం మిస్ అయినా ఇప్పుడు మ‌హేష్‌ వాయిస్ ఓవ‌ర్ అందిస్తుండ‌డంతో మ‌హేష్ అభిమానుల్లో కూడా ఈ సినిమా పై ఆస‌క్తి పెరిగింది. గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో వ‌చ్చిన‌ జ‌ల్సా చిత్రానికి వాయిస్ ఓవ‌ర్ అందించారు. ఇప్పుడు మ‌ళ్లీ మెగా హీరోలు చిరు, చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన ఆచార్య చిత్రానికి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు వాయిస్ ఓవ‌ర్ అందించ‌డం విశేషం.

Also Read : ఆచార్య ప్రీ రిలీజ్ వేదిక మారిందా..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్