కింగ్ నాగార్జున ప్రస్తుతం 99వ సినిమా చేయనున్నారు. రైటర్ బెజవాడ ప్రసన్నకుమార్ దీనికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారు. అయితే.. ఇది పీరియాడ్ మూవీ. అందుచేత 90లో నాగార్జున ఎలా ఉండేవారో అలా చూపించాలి అనుకుంటున్నారట మేకర్స్. దీని కోసం ఫోటో సెషన్ చేసి లుక్ ఫైనల్ చేశారని తెలిసింది. వచ్చే నెలలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
ఇంతకీ విషయం ఏంటంటే.. ఆచార్య సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చిరంజీవిని చాలా యంగ్ గా చూపించడం కోసం సరికొత్త టెక్నాలజీని వాడారు. టెక్నాలజీ బాగానే పని చేసింది. చిరంజీవి వింటేజ్ లుక్ లోకి మారిపోయారు కానీ.. సినిమా ఫ్లాప్ అయ్యింది. దాంతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ వాడి తయారుచేసిన చిరు లుక్ పై కూడా విమర్శలు వచ్చాయి. బెజవాడ ప్రసన్న కుమార్ తో చేస్తున్న మూవీలో కూడా ఓ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉందట. ఈ ఎపిసోడ్ కోసం ఆచార్య సినిమాలో వాడిన గ్రాఫిక్స్ ను వాడాలని అనుకుంటున్నారట మేకర్స్.
కిల్లర్, నిర్ణయం, వారసుడు, హలో బ్రదర్ సినిమాల్లో నాగ్ లుక్ కు దగ్గరగా కొత్త సినిమాలో వింటేజ్ లుక్ ను సెట్ చేయడానికి ప్రయత్నాలు ఆరంభించారు. ఈ మేరకు కొన్ని రఫ్ స్కెచ్ లు కూడా రెడీ చేశారు. అంతా ఓకే అనుకుంటే, వయసు తగ్గించే విజువల్ ఎఫెక్ట్స్ వాడేస్తారు. అయితే.. చిరంజీవికి సూట్ అవ్వని ఈ గ్రాఫిక్స్ నాగార్జునకు మాత్రం కరెక్ట్ గా సెట్ అవుతాయనేది చూడాలి. ఎందుకంటే.. నాగ్ ఇప్పటికీ మంచి ఫిజిక్, లుక్ మెయింటైన్ చేస్తుంటారు. కాబట్టి నాగ్ ని వింటేజ్ లుక్ లో చూపించినా విమర్శలు రావు. మరి.. ఈ లుక్ లో తెర పై నాగ్ ఎలా ఉంటారో చూడాలి.