Monday, January 20, 2025
HomeTrending Newsమోడీ పాలనకు రూపాయి విలువే నిదర్శనం - ఖర్గే విమర్శ

మోడీ పాలనకు రూపాయి విలువే నిదర్శనం – ఖర్గే విమర్శ

ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక గురించి బీజేపీ ఏం మాట్లాడుతుంది అనేది అసంబద్దమని ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. బిజెపిలో అద్వానీ ఎన్నిక ఎలా జరిగింది ..?, గడ్కరీ ఎన్నిక ఎలా జరిగింది..అమిత్ షా ఎలా అయ్యారు..నడ్డాకి పదవి కాలం పొడిగింపు ఎలా జరిగింది…ఎదుటి వారి గురించి మాట్లాడే ముందు తమ పరిస్థితి ఏంటో చూసుకోవాలని ఖర్గే హితవు పలికారు.

కాంగ్రెస్ చరిత్రలో నాలుగు సార్లు మాత్రమే అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ఆయన.. నేడు ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు. శనివారం ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మల్లికార్జున ఖర్గేకు టీ కాంగ్రెస్ నాయకుల నుంచి ఘన స్వాగతం లభించింది. టీపీసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరికొందరు ముఖ్య నాయకులు.. ఖర్గేకు స్వాగతం పలికారు.

అనంతరం గాంధీభవన్‌కు చేరుకున్న మల్లికార్జున ఖర్గే.. అక్కడ తెలంగాణ పీసీపీ మెంబర్లతో సమావేశమయ్యారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని కోరారు. ఒకే పార్టీలోని నేతల మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది అని పేర్కొన్నారు. బీజేపీ చరిత్రలో ఇలాంటి ఎన్నిక ఎప్పుడూ జరగలేదని కామెంట్ చేశారు. నిరుద్యోగితను తగ్గిస్తానని మోదీ గొప్పలు చెప్పారని.. కోవిడ్ తర్వాత కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగిత మరింత పెరిగిందని అన్నారు.

మోదీ పాలనలో డాలర్ తో రూపాయి విలువ రూ. 82కు పెరిగిందని విమర్శించారు. బీజేపీ పాలనలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయని మండిపడ్డారు. పాల నుంచి మొదులుకుని చిన్నపిల్లలు వాడే పెన్సిళ్లు, రబ్బర్లపైనా జీఎస్టీ బాదుతున్నారని విమర్శించారు. గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,100 దాటిందన్నారు. పెట్రోల్ బంక్ లో మోడీ ఫోటో లు పెట్టి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ అని ప్రచారం చేసుకుంటున్నారని, గ్యాస్ ధర గురించి కూడా చెప్తే  బాగుండేదన్నారు.

136 ఏళ్ల  కాంగ్రెస్ పార్టీలో నేతలకు, కార్యకర్తలకు వాక్ స్వతంత్రం అధికం అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో బరిలో నిలిచిన తాను అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నానని ఖర్గే చెప్పారు. తనకు ఓటేయమని పీసీసీ సభ్యులను కోరేందుకే హైదరాబాద్‌కు వచ్చానని చెప్పారు. చాలా మంది సీనియర్లు తనకు మద్దతు ప్రకటించారని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్