Thursday, April 10, 2025
HomeTrending Newsహైదరాబాద్ కు వస్తున్న మల్లికార్జున్ ఖర్గే

హైదరాబాద్ కు వస్తున్న మల్లికార్జున్ ఖర్గే

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే హైదరాబాద్ రేపు రానున్న్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక మల్లికార్జున్ ఖర్గే మొదటిసారి హైదరాబాద్ వస్తున్నారు. రేపు ఉదయమే హైదరాబాద్ చేరుకోనున్న మల్లికార్జున్ ఖర్గే తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు.

రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లో భారత్ జోడో యాత్ర లో రాహుల్ గాంధీ తోపాటు పాదయాత్రలో పాల్గొంటారు. రేపు రాత్రి 7 గంటలకు నెక్ లెస్ రోడ్ లో జరగనున్న రాహుల్ గాంధీ భారత్ జోడో కార్నర్ మీటింగ్ లో మల్లికార్జున్ ఖర్గే  పాల్పాగొంటారు. రాహుల్ గాంధి,  మల్లికార్జున్ ఖర్గే ఇద్దరు అగ్రనేతలు రేపు హైదరాబాద్ నగరంలో పాదయాత్ర చేయనుండటంతో పార్టీ శ్రేణులు జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున నగరానికి చేరుకుంటున్నారు.

Also Read : ధరణి రద్దు చేస్తాం – రాహుల్ గాంధి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్