Saturday, January 18, 2025
Homeసినిమా'భ్రమయుగం' .. ఆకట్టుకునే ఓ ప్రయోగం! 

‘భ్రమయుగం’ .. ఆకట్టుకునే ఓ ప్రయోగం! 

మలయాళంలో భారీ సినిమాల నిర్మాణం తక్కువగా జరుగుతుంది. కంటెంట్ కి ప్రాధాన్యతనిస్తూ వాళ్లు ముందుకువెళ్లిపోతూ ఉంటారు. సాధ్యమైనంతవరకూ సహజత్వాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తారు. ఎక్కువగా గ్రాఫిక్స్ పై ఆధారపడే ఆలోచన కూడా చేయరు. తక్కువ పాత్రలతో .. తక్కువ రోజులలో షూటింగును పూర్తి చేసి, అనూహ్యమైన విజయాలను అందుకోవడం వాళ్లకి బాగా తెలుసు. అదే విషయాన్ని మరోమారు నిరూపించిన సినిమానే ‘భ్రమయుగం’.

మమ్ముట్టి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, మలయాళంలో ఈ నెల 15వ తేదీన విడుదలై, అక్కడ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో నిన్ననే థియేటర్లకు వచ్చింది. నిజం చెప్పాలంటే ఈ సినిమాకి సంబంధించి తెలుగులో జరిగిన ప్రమోషన్స్ అంతంత మాత్రమే. అయితే ఈ సినిమాను బ్లాక్ అండ్ వైట్ లో చిత్రీకరించారనే విషయం తెలిసినవారు ఆసక్తిని చూపించారు. ఇక ఇది హారర్ థ్రిల్లర్ అని తెలిసినవారు, ఆ జోనర్ ను ఇష్టపడేవారు థియేటర్స్ కి వెళ్లారు.

17వ శతాబ్దంలో జరిగే ఈ కథలో మూడే ప్రధానమైన పాత్రలు కనిపిస్తాయి. ఒక పాడుబడిన ఇంట్లో ఈ మూడు పాత్రల చుట్టూనే కథ తిరుగుతుంది. కథను అల్లుకున్న తీరు .. మూడు పాత్రలను వైవిధ్యభరితంగా డిజైన్ చేసుకున్న విధానం .. క్లైమాక్స్ దిశగా వాటిని నడిపించిన పద్ధతి ఆడియన్స్ ను మెప్పిస్తుంది. ఇంత సింపుల్ కంటెంట్ ను ఇలా కూడా చెప్పొచ్చా అనిపిస్తుంది.  లైటింగ్ ఎఫెక్ట్ .. సౌండ్ ఎఫెక్ట్ .. ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టేస్తాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఒక సినిమా రాలేదనే చెప్పాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్