Thursday, April 3, 2025
Homeసినిమా‘మా’ భవనం కోసం మూడు స్థలాలు : మంచు విష్ణు

‘మా’ భవనం కోసం మూడు స్థలాలు : మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, సివిల్ నరసింహారావు పోటీ చేయనున్నట్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. మంచు విష్ణు తన డబ్బులతో మా భవనం కడతానని గతంలో ప్రకటించారు. ఇప్పుడు.. ఆయన చెప్పిన మాటలను నిజం చేసే పనిలో బిజీగా ఉన్నారు. అవును.. ‘మా’ భవనం కోసం స్థలం చూసే పనిలో నిమగ్నమయ్యారు. తాజాగా భవనం కోసం మూడు స్థలాలు చూసినట్టుగా ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.

విష్ణు ఓ వీడియో రిలీజ్ చేశారు. మా భవనం మన అందరి కల. అది త్వరలోనే నెరవేరబోతుంది. నేనే స్వయంగా వెళ్లి మూడు స్థలాలను చూశాను.  వాటిలో ఏది అనుకూలంగా ఉంటుందనేది అందరం కూర్చుని నిర్ణయిద్దాం. త్వరలోనే మన కల నెరవేరనుంది అని ఆ వీడియో ద్వారా మంచు విష్ణు తెలియచేశారు. ప్ర‌భుత్వం అనువైన స్థ‌లం కేటాయించి ఇస్తే.. అందులో బిల్డింగ్ క‌ట్టాలని సినీ పెద్దలు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. మా భ‌వ‌న నిర్మాణం స‌మ‌స్య కాదు. స్థ‌ల‌మే ప్ర‌ధాన స‌మ‌స్య‌. మరి.. రంగంలోకి దిగిన విష్ణు స్పీడు చూస్తుంటే.. త్వరలోనే మా కల నెరవేరబోతుంది అనిపిస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్