Sunday, January 19, 2025
Homeసినిమాఅత్యంత క్లిష్టంగా సూపర్ స్టార్ కృష్ణ పరిస్థితి

అత్యంత క్లిష్టంగా సూపర్ స్టార్ కృష్ణ పరిస్థితి

సూపర్‌స్టార్‌ కృష్ణ ఆరోగ్య పరిస్థితి  అత్యంత క్లిష్టంగా ఉందని, మరో 48 గంటల వరకూ  ఏమీ చెప్పలేమని గచ్చిబౌలి కాంటినెంటల్‌ ఆస్పత్రి వైద్యులు  వెల్లడించారు.  ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని చెప్పారు.  ‘‘కార్డియాక్‌ ఆరెస్టుతో కృష్ణను ఆస్పత్రికి తీసుకొచ్చారు. కార్డియాలజిస్టుల బృందం ప్రత్యేక పర్యవేక్షణ చేస్తోంది. కృష్ణకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్నాం. 24గంటల వరకు ఏమీ చెప్పలేం. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు మరోసారి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేస్తాం’’ అని వైద్యులు తెలిపారు. కృష్ణ ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకుందామని, ప్రతి గంటా కీలకమేనని, ఆయనకు మంచి జరగాలని ప్రార్ధన చేద్దామని డాక్టర్లు చెప్పారు. చికిత్సకు కృష్ణ శరీరం సహకరిస్తుందా లేదా అనేది ఊహించి చెప్పలేమన్నారు.

అయితే… కృష్ణ ఆరోగ్యం గురించి ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే.. చాలా సంవత్సరాల క్రితం కృష్ణకు క్యాన్సర్ వచ్చిందట. అప్పట్లో ట్రీట్మెంట్ చేయించడంతో తేరుకున్నారు. ఇప్పుడు మళ్లీ అదే సమస్య తిరగబెట్టిందని.. దాంతో నగరంలోని కాంటినెంటెల్ ఆసుపత్రిలో కీమో చికిత్స పొందుతున్నారని సమాచారం. ఆమధ్య కృష్ణ రెండో భార్య విజయనిర్మల చనిపోయింది. ఇటీవల మొదటి భార్య ఇందిరా దేవి చనిపోయింది. అలాగే పెద్ద కుమారుడు రమేష్‌ బాబు కూడా చనిపోవడంతో ఆయన బాగా డల్ అయ్యారు.

అందుకనే.. మహేష్ బాబు తండ్రితో ఎక్కువ సమయం గడుపుతున్నారట. ప్రస్తుతం మహేష్‌ బాబు, నరేష్‌, కుటుంబ సభ్యులు హాస్పటల్ దగ్గరే ఉన్నారు. ముందు స్వల్ప అనారోగ్యమే అనుకున్నప్పటికీ.. తర్వాత వ్యాధి తీవ్రత సీరియస్ గా ఉండడంతో ఐసీయూలో పెట్టి చికిత్స చేస్తున్నారు.

Also Read : సూపర్ స్టార్ కృష్ణకు అస్వస్థత 

RELATED ARTICLES

Most Popular

న్యూస్