Tuesday, April 29, 2025
Homeసినిమా‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్

‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్

శివకార్తికేయన్ కథానాయకుడిగా మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మహావీరుడు’ ఈ నెల 14న థియేటర్లలో విడుదల కానుంది. అదితి శంకర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శాంతి టాకీస్‌ పతాకంపై అరుణ్‌ విశ్వ నిర్మించారు. విడుదల తేదీ సమీపిస్తున్నందున మేకర్స్ మరింత జోరుని పెంచారు.

ఈ చిత్రానికి రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్టు మేకర్స్ ప్రోమోను విడుదల చేశారు. శివకార్తికేయన్ కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, అతను ఏదో ఒక ప్రత్యేక శక్తి నుండి గైడెన్స్ కోరుతున్నట్లుగా ఆకాశం వైపు చూస్తాడు. అప్పుడు ఓ పవర్ లో ధైర్యమే జయం అంటూ రవితేజ వాయిస్ వినిపించడం ఆసక్తికరంగా వుంది. రవితేజ వాయిస్ ఓవర్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవనుంది.”రవితేజ సార్ మా సినిమాలో మీ ఎనర్జిటిక్ వాయిస్ అందించడం చాలా ఆనందంగా ఉంది. మహావీరుడు టీమ్‌కి మీరు అందించిన సపోర్ట్‌కి చాలా కృతజ్ఞతలు సార్. జూలై 14 నుండి  మహావీరుడు. ధైర్యమే జయం” అని శివకార్తికేయన్ ట్వీట్ చేశారు.ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్