Sunday, January 19, 2025
Homeసినిమాచిరు, పవన్ మల్టీస్టారర్ ఎప్పుడు?

చిరు, పవన్ మల్టీస్టారర్ ఎప్పుడు?

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌..  అన్నదమ్ములిద్దరూ కలిసి సినిమా చేస్తే చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఆ మధ్య సీనియర్ ప్రొడ్యూసర్ టి. సుబ్బిరామిరెడ్డి చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అంతే కాకుండా.. ఈ భారీ మల్టీస్టారర్ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు అని కూడా అనౌన్స్ చేశారు. ఆతర్వాత ఈ ప్రాజెక్ట్ ఏమైందో ఎవరికీ తెలియదు. అభిమానులు మాత్రం ఎప్పుడెప్పుడు అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ కలిసి సినిమా చేస్తారా..? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

అయితే.. మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సందర్భంగా అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చిరంజీవికి పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమా ఎప్పుడు అనే ప్రశ్న ఎదురైంది. దీనికి చిరంజీవి.. పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నాడు. అలాగే తను కమిట్ అయిన సినిమాలు ఉన్నాయి.

అందుచేత తను ఒప్పుకున్న సినిమాలు పూర్తయ్యాకా రెండు, మూడేళ్లల్లో వపన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని చెప్పారు చిరంజీవి. దీనిని బట్టి తమ్ముడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని చిరంజీవి కూడా ఫిక్స్ అయ్యారు అనిపిస్తుంది. ఈ అన్నదమ్ములిద్దరూ కలిసి నటించడానికి రెడీ.. అలాగే ఈ క్రేజీ కాంబినేషన్లో మూవీని సినిమాని నిర్మించడానికి కూడా నిర్మాతలు రెడీనే. కాకపోతే కావాల్సిందల్లా.. ఈ కాంబినేషన్ కి తగ్గట్టుగా ఉండే పవర్ ఫుల్ స్టోరీ. మరి.. ఆ స్టోరీని ఎవరు రెడీ చేస్తారో..? ఎవరు డైరెక్ట్ చేస్తారో..?  క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్