Sunday, January 19, 2025
Homeసినిమాజక్కన్న టీమ్ పై మెగాస్టార్ కోపంగా ఉన్నారా..?

జక్కన్న టీమ్ పై మెగాస్టార్ కోపంగా ఉన్నారా..?

ఎన్టీఆర్, రామ్ చరణ్‌, రాజమౌళిల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లు కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. అలాగే జపాన్ లో కూడా ఇటీవల రిలీజై ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డులు సృష్టించింది. దాదాపు 25 ఏళ్ల నుంచి ఉన్న రజనీకాంత్ ముత్తు రికార్డ్ ను క్రాస్ చేసి ఆర్ఆర్ఆర్ జపాన్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇలా ఆర్ఆర్ఆర్ విడుదలైన ప్రతిచోట సంచలనాలు సృష్టించింది. అంతే కాకుండా గ్లోబల్ అవార్డ్ ను దక్కించుకుని చరిత్ర సృష్టించడం విశేషం.

ఇదిలా ఉంటే.. ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ఎన్టీఆర్ నటనకు ఆస్కార్ అవార్డ్ రానుందని ప్రచారం జరిగింది. అంతే కాకుండా హాలీవుడ్ మ్యాగజైన్ లో సైతం ఎన్టీఆర్ కు బాగా ప్రచారం జరిగింది. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళికి హాలీవుడ్ లో ఎనలేని క్రేజ్ వచ్చింది. స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ వంటి పేరొందిన డైరెక్టర్లు రాజమౌళి తీసిన విధానం పై ప్రశంసలు కురిపించారు. అలాగే, ఈ సినిమాని ఆస్కార్ బరిలో నిలిపేందుకు రాజమౌళి టీం కోట్లు ఖర్చుపెట్టి ప్రమోషన్ చేసింది. అయితే.. ఈ పబ్లిసిటీలో భాగంగా పేరొందిన పత్రికలు, వెబ్ సైట్ లలో ఎన్టీఆర్ ని ఎక్కువగా హైలెట్ చేశారు అనే అసంతృప్తి రామ్ చరణ్ అభిమానుల్లో కనిపించింది.

ఇక అసలు విషయానికి వస్తే… తన కుమారుడి నటనకు రావాల్సిన గుర్తింపు అంతర్జాతీయ పత్రికల్లో ఎక్కువగా రాజమౌళి టీం పుష్ చెయ్యలేదని మెగాస్టార్ చిరంజీవి కొంత బాధపడ్డారని.. జక్కన్న టీం పై కోపంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ ని పుష్ చెయ్యడంలో చిరంజీవికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ రామ్ చరణ్ ని కూడా అదే స్థాయిలో రాజమౌళి టీం ప్రోమోట్ చెయ్యలేదు అని చిరంజీవిలో అసంతృప్తి ఉంది. అందుకే జేమ్స్ కామెరూన్ రామ్ చరణ్ పోషించిన పాత్ర గురించి ప్రస్తావించడంతో తనంత తానుగా ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈవిధంగా జక్కన్న టీం పై మెగా అసంతృప్తిని చిరు బయటపెట్టారని ఇన్ సైడ్ టాక్.

Also Read : రాజమౌళి గొప్ప సేల్స్ మ్యాన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్