Sunday, January 19, 2025
Homeసినిమామరో మాస్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన మెగాస్టార్!

మరో మాస్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన మెగాస్టార్!

ట్రెండ్ కి తగినట్టుగానే చిరంజీవి యంగ్ డైరెక్టర్స్ కి అవకాశాలిస్తూ వెళుతున్నారు. అలా బాబీ  దర్శకత్వంలో ఆయన చేసిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేసింది. ప్రస్తుతం ఆయన మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 40 శాతం వరకూ షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. తమన్నా కథానాయికగా నటించిన ఈ సినిమా, దసరా బరిలో దిగొచ్చుననే టాక్ బలంగా వినిపిస్తోంది.

దాంతో ఆ తరువాత సినిమాను ఆయన ఏ దర్శకుడితో చేయవచ్చనే విషయంపై అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. పూరి .. మారుతి .. వెంకీ కుడుముల పేర్లు వినిపించాయి. కానీ తాజాగా త్రినాథరావు నక్కిన పేరు తెరపైకి వచ్చింది. ఆయన చిరంజీవిని కలవడం .. ఒక కథ చెప్పడం .. చిరంజీవి తప్పకుండా చేద్దామని అనడం జరిగిపోయాయని అంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక రవితేజ సిఫార్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. రవితేజకి త్రినాథరావు నక్కిన ‘ధమాకా’తో సూపర్ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

రవితేజ చేసిన ‘ధమాకా’ మాస్ హిట్ .. ఆ సినిమాను చూసిన చిరంజీవి, కంటెంట్ ను పెర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసిన త్రినాథరావును అభినందించారట. కొత్త కథకి సంబంధించి పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసి వినిపించమన్నారని టాక్. దాంతో త్రినాథరావు అదే పనిలో ఉన్నాడని అంటున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించడానికి డీవీవీ దానయ్య ముందుకొచ్చాడని సమచారం. ఈ ఏడాది చివరిలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్