Sunday, January 19, 2025
Homeసినిమారిలీజ్ కి ముందే పార్టీ చేసుకున్న మెగాస్టార్

రిలీజ్ కి ముందే పార్టీ చేసుకున్న మెగాస్టార్

చిరంజీవి, రవితేజ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వాల్తేరు వీరయ్య‘. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చిరంజీవికి జంటగా శృతిహాసన్ నటిస్తే… రవితేజకు జంటగా కేథరిన్ నటించింది. ఈ మూవీ టీజర్ అండ్ సాంగ్స్ కు ఊహించిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్ రావడంతో మూవీ పై మరింత క్రేజ్ ఏర్పడింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ వాల్తేరు వీరయ్య చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా చాలా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో చిరంజీవి మాట్లాడిన విధానం చూస్తుంటే… వాల్తేరు.. ’పై త‌న‌కున్న కాన్ఫిడెన్స్ లెవ‌ల్స్ అర్థ‌మ‌వుతుంది. ఈ సినిమా పై ఎన్ని అంచ‌నాలైనా పెంచుకోండి.. త‌ప్ప‌కుండా అందుకొంటాం అంటూ అంచనాలు మరింత పెంచేశారు. ఇప్పుడు.. చిత్ర‌బృందానికి ముంద‌స్తు పార్టీ కూడా ఇచ్చేశారు. జ‌న‌వ‌రి 1 సంద‌ర్భంగా చిరంజీవి ఇంట్లో ఓ భారీ పార్టీ జ‌రిగింది. ఈ పార్టీలో వాల్తేరు వీర‌య్య‌ టీమ్ మొత్తం పాల్గొంది. ఈ సినిమాకి ప‌ని చేసిన టెక్నీషియ‌న్లంద‌రిని పార్టీకి ఆహ్వానించారు చిరు. ఈ సినిమాకి సంబంధించిన వాళ్లల్లో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంద‌ర్నీ పార్టీకి పిలిచారు.

ఈ పార్టీలో చిరు భ‌లే హుషారుగా క‌నిపించార‌ని, ఈ సినిమాకి ప‌ని చేసినందుకు అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు చెప్పార‌ని తెలిసింది. అయితే… ఎవరైనా ఓ సినిమా హిట్ట‌య్యాక‌… ఇలాంటి పార్టీలు ఇస్తుంటారు కానీ.. చిరంజీవి ముందుగానే పార్టీ ఇచ్చారంటే.. వాల్తేరు వీరయ్య పై ఎంత నమ్మకంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మరో వైపు వాల్తేరు వీరయ్య సెన్సార్ పూర్తయ్యింది. సెన్సార్ టాక్ కూడా పాజిటీవ్ గా వచ్చింది. ఈ సినిమాలో చిరంజీవిని చూస్తుంటే.. ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిన చిరంజీవిలా కనిపిస్తున్నారు. సో.. ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర  వీరయ్య వీర లెవల్ లో దూసుకుకోవడం ఖాయం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్