Monday, September 23, 2024
Homeసినిమా'భోళా శంకర్' అప్ డేట్ ఇచ్చిన మెగాస్టార్

‘భోళా శంకర్’ అప్ డేట్ ఇచ్చిన మెగాస్టార్

చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో  రూపొందుతోన్న చిత్రం’భోళా శంకర్’. ఈ మూవీ టీజర్‌లో చిరు తన వింటేజ్ స్టైలిష్ మాస్ అవతార్‌ లో కనిపించి అందరినీ అలరించారు. ఇటివలే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా చిరంజీవి ‘భోళా శంకర్’ డబ్బింగ్ పూర్తి చేశానని తెలియచేస్తూ ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా డబ్బింగ్ స్టూడియో నుంచి ఫోటోలు అభిమానులతో పంచుకున్నారు.

సినిమా రూపుదిద్దుకున్న తీరు చాలా ఆనందంగా ఉంది. ఈ ఫైర్ మాస్ ఎంటర్‌టైనర్ ఖచ్చితంగా ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుంది. మీ క్యాలెండర్‌ లను మార్క్ చేసుకోండి! థియేటర్స్ లో కలుద్దాం! # భోళాశంకర్ ఆగస్టు 11” అని ట్వీట్ చేశారు మెగాస్టార్. ఇటివలే విడుదలైన ఈ చిత్రం టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాలోని ఫస్ట్ సింగిల్ ఇప్పటికే చార్ట్‌బస్టర్‌ గా నిలిచింది. మిగిలిన పాటలు ఒకదాని తర్వాత ఒకటి విడుదలౌతాయి. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఈ మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. డడ్లీ డీవోపీ గా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందించారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్