-0.2 C
New York
Wednesday, November 29, 2023

Buy now

Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ఢిల్లీకి మేకపాటి: పెట్రో కాంప్లెక్స్ పై కీలక భేటి

ఢిల్లీకి మేకపాటి: పెట్రో కాంప్లెక్స్ పై కీలక భేటి

కాకినాడ సెజ్ లో పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు పైన చర్చించడం కోసం పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఢిల్లీకి పయనమవుతున్నారు. అయన  మంగళవారం సాయంత్రం బయలుదేరి రాత్రి ఢిల్లీకి చేరన్నారు. ఇటీవల సీఎం జగన్ ఢిల్లీ పర్యటనతో కేంద్ర ప్రభుత్వంలో మెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు విషయంలో కదలిక వచ్చింది. బుధవారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో కూడిన ప్రత్యేక బృందం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో మెట్రో కాంప్లెక్స్ ఏర్పాటుపై సమావేశం కానుంది.

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న మేరకు కాకినాడ సెజ్లో పెట్రో కాంప్లెక్స్ స్థాపనకై ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన అనంతరం కీలక అడుగుపడింది. ఇందుకు సంబంధించి ముఖ్యమైన సమావేశాన్ని కేంద్రం బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో పూర్తి వివరాలతో కూడిన ప్రజెంటేషన్ ను కేంద్ర మంత్రికి రాష్ట్ర అధికారులు వివరించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్