Sunday, February 23, 2025
HomeTrending Newsధైర్యంగా వెళుతున్నాం: సజ్జల

ధైర్యంగా వెళుతున్నాం: సజ్జల

False propaganda: ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షేమం అందించాం కాబట్టే ప్రజల్లోకి ధైర్యంగా వెళుతున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. ప్రతి ఇంటికీ ఏయే పతకాలు అందిస్తున్నామో కరపత్రం కూడా అందిస్తూ అడుగుతున్నామని చెప్పారు. అయితే  వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నరంటూ చంద్రబాబు, అయన పార్టీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొన్ని చోట్ల టిడిపి కార్యకర్తలే అడ్డుకుని వాటిని ప్రచారం చేసుకుని భూతద్దంలో చూపుతున్నారని విమర్శించారు. అన్నిచోట్లా ప్రజలు ప్రజా ప్రతినిధులకు స్వాగతం పలుకుతున్నారని, కావాలంటే రోజంతా ప్రజలతో మాట్లాడింది రికార్డ్ చేసుకొని, ఆ వీడియోలు విడుదల చేయాలని సజ్జల సవాల్ చేశారు. ఈ రకమైన దుష్ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట అని వ్యాఖ్యానించారు.

వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించే కార్యక్రమాన్ని శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్ట్‌గా చేస్తున్నామని…. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామని, మీటర్లు పెట్టడం వల్ల కేంద్రం నుంచి మనకు మేలు జరుగుతుంది కాబట్టే అమలు చేస్తున్నామని, దీనిపై కూడా చెప్పిన అబద్ధాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పి రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. ఉచిత విద్యుత్ ను మరింత సమర్ధంగా కొనసాగించేందుకు సిఎం జగన్ ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని సజ్జల వివరించారు.

Also Read : మాల్ ప్రాక్టీస్ చేయడం తప్పు కాదా? సజ్జల 

RELATED ARTICLES

Most Popular

న్యూస్