Sunday, January 19, 2025
HomeTrending Newsప్రధాని పర్యటనపై మంత్రి సమీక్ష

ప్రధాని పర్యటనపై మంత్రి సమీక్ష

ఈనెల 11,12వ తేదీలో విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు వస్తోన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని వెంట పర్యటనలో పాల్గొంటారు. ప్రధానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘన స్వాగతం పలికేందుకు తీసుకోవాల్సిన చర్యలు, బహిరంగ సభ ఏర్పాట్లపై జిల్లా ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులతో  విశాఖ కలెక్టరేట్ లో సమావేశమై చర్చించారు. ఈ సమావేశంలో ఎంపీ విజయసాయి రెడ్డి, విశాఖ నగర మేయర్, కార్పొరేటర్లు, జిల్లా పరిషత్ చైర్మన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్